ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో తగ్గని కరోనా ఉద్ధృతి - గుంటూరు కరోనా కేసులు న్యూస్

గుంటూరు జిల్లాలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. జిల్లాలో కొత్తగా 702 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 43వేల 510 పాజిటివ్ కేసులు నమోదు కాగా... కరోనా నుంచి కోలుకుని 33వేల 468 మంది ఇంటికి చేరుకున్నారు. కొత్తగా కొవిడ్ వైరస్ కారణంగా 10 మంది మృతిచెందారు. మొత్తం మరణాల సంఖ్య 438 కి చేరింది.

గుంటూరు జిల్లాలో తగ్గని కరోనా ఉద్ధృతి
గుంటూరు జిల్లాలో తగ్గని కరోనా ఉద్ధృతి

By

Published : Sep 8, 2020, 11:39 PM IST

కరోనాతో రాష్ట్రంలోనే అత్యధిక మరణాలు సంభవించిన జిల్లాల్లో గుంటూరు జిల్లా రెండో స్థానంలో ఉంది. కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే 126 కేసులు నమోదయ్యాయి. ఇక మండల వారిగా నమోదైన కేసులు వివరాలు ఇలా ఉన్నాయి.

నరసరావుపేట-64, తెనాలి-52, తాడేపల్లి-43, మంగళగిరి-33, మాచర్ల-30, నూజండ్ల-28, రెంటచింతల-25, బాపట్ల-20, చేరుకుపల్లి-20, కాకుమాను-19, అమృతలూరు-19, తాడికొండ-17, గురజాల-17, వట్టిచెరుకూరు-16, చిలకలూరిపేట-15, కారంపూడి-14, భట్టిప్రోలు-13, గుంటూరు రూరల్-12, సత్తెనపల్లి-11 చొప్పున కేసులు నమోదయినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details