గుంటూరు జిల్లా మేడికొండూరు మండలానికి చెందిన.. ఆరేళ్ల చిన్నారిని అపహరించి అత్యాచారం చేశాడు ఓ ప్రబుద్ధుడు. భిక్షాటన చేసుకుని జీవించే దంపతుల కుమార్తె అయిన ఈ చిన్నారి.. రోజు మాదిరిగానే మంగళవారం భిక్షాటన చేసేందుకు వెళ్లింది. చీకటి పడుతున్నా ఇంటికి చేరలేదు. కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వెతికినా.. జాడ లేదు. ఈ మేరకు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల దృశ్యాలను పోలీసులు పరిశీలించగా.. గుర్తు తెలియని వ్యక్తి చిన్నారిని అపహరించి.. తీసుకెళ్లినట్లు గుర్తించారు.
ఓ రైల్వే స్టేషన్లో చిన్నారి ఏడుస్తూ కనిపించింది. నిందితుడిని గుంటూరు రూరల్ నల్లపాడుకు చెందిన స్వామిగా బుధవారం సాయంత్రం గుర్తించారు. పాపకు మాయమాటలు చెప్పి రైల్వేస్టేషన్ సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు విచారణలో తేలింది. స్వామిపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు మేడికొండూరు సీఐ ఆనందరావు తెలిపారు.