ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసులు కుమారుడిని కొట్టారని.. ఆ తల్లి ఏం చేసిందంటే..!

Mother suicide attempt: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడిని పోలీసులు చిత్రహింసలకు గురి చేయటం చూసి ఓ తల్లి హృదయం బద్దలైంది. ఆ దారుణాన్ని చూసి తట్టుకోలేక మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది.

ఆత్మహత్యాయత్నం
ఆత్మహత్యాయత్నం

By

Published : May 31, 2022, 5:53 PM IST

కన్న కొడుకుని తన ముందే పోలీసులు కొట్టారు... ఎన్నో చిత్రహింసలకు గురి చేశారు.. ఈ దారుణాన్ని చూసి తట్టుకోలేక ఓ తల్లి మనస్తాపానికి గురైంది. ఏం చేయాలో దిక్కుతోచక తానే తనువు చాలించాలనుకుంది. అంతే పురుగుల మందు తాగేసింది. ఈ ఘటన ఏలూరు జిల్లా టి-నర్సాపురం మండలంలో జరిగింది. టి-నర్సాపురం పోలీస్ స్టేషన్‌ పరిధిలో పేకాట శిబిరాలపై దాడులు చేసిన పోలీసులు.. అక్కడే ఉన్న పోతురాజుల సూర్యకిరణ్ అనే విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు.

తల్లిదండ్రులు విషయం తెలుసుకుని స్టేషన్‌కు వెళ్లగా.. తమ ఎదుటే సూర్యకిరణ్‌ను పోలీసులు కొట్టినట్లు బాధితుడి తండ్రి ఆరోపించారు. కొడుకుని చిత్రహింసలకు గురి చేయడంతో మనస్తాపానికి గురైన తల్లి సరోజిని.. పురుగుల మందు తాగిందన్నారు. ఆమెను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించామని.. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్య కోసం ఏలూరు ఆస్పత్రికి తరలించామన్నారు.

కుమారుడిని పోలీసులు కొట్టడం చూడలేక... తల్లి ఆత్మహత్యాయత్నం

ఇదీ చదవండి:కూతురి మృతదేహంతో 4 రోజులు ఇంట్లోనే తల్లి.. ఏం చేస్తోందంటే?

ABOUT THE AUTHOR

...view details