ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తప్పు చేసిన వారు ఎవరైనా.. శిక్ష తప్పదు' - హోంమంత్రి తానేటి వనిత వార్తలు

చట్టం ముందు అందరూ సమానమేనని, తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష తప్పదని హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా జి.కొత్తపల్లి లో హత్యకు గురైన గంజి ప్రసాద్ కుటుంబాన్ని హోం మంత్రి పరామర్శించారు. గంజి ప్రసాద్ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

హోంమంత్రి తానేటి వనిత
హోంమంత్రి తానేటి వనిత

By

Published : May 2, 2022, 5:42 AM IST

చట్టం ముందు అందరూ సమానమేనని, తప్పు చేసినవారు ఎవరైనా శిక్ష తప్పదని హోం మంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. శనివారం ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో వైకాపా నాయకుడు గంజి ప్రసాద్‌ హత్యకు గురికాగా పరామర్శకు వెళ్లిన గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై గ్రామస్థులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేను తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మంత్రి వనిత, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌, వైకాపా జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆదివారం పరామర్శించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ‘హత్య, ఎమ్మెల్యేపై దాడి ఘటనలపై పూర్తి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తాం. పరామర్శకు ఎమ్మెల్యే వెళ్లేసరికి అక్కడ ప్రశాంతంగా ఉంది. వేరే వ్యక్తులు చొరబడి ఎమ్మెల్యేపై దాడి చేశారు’ అని తెలిపారు.

'తప్పు చేసిన వారు ఎవరైనా.. శిక్ష తప్పదు'

గంజి ప్రసాద్‌ కుటుంబానికి పరామర్శ
జి.కొత్తపల్లిలో హత్యకు గురైన వైకాపా గ్రామ కమిటీ అధ్యక్షుడు గంజి ప్రసాద్‌ మృతదేహానికి హోం మంత్రి తానేటి వనిత, మాజీ మంత్రి ఆళ్ల నాని, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌ పూలమాలలు వేసి, నివాళులర్పించారు. గ్రామస్థులందరూ ఏ పని ఉన్నా తన భర్త దగ్గరకు వచ్చేవారని, తన వద్దకు రావడం లేదనే కోపంతోనే బిరుదుగడ్డ బజారయ్య ఆయనను హత్య చేయించారని ప్రసాద్‌ భార్య సత్యవతి రోదిస్తూ హోం మంత్రికి చెప్పారు. గంజి ప్రసాద్‌ హత్య చాలా దురదృష్టకరమని, ఆయన మృతి పార్టీకి తీరని నష్టమని హోం మంత్రి కంటతడి పెట్టారు.

ఎమ్మెల్యేపై దాడి ఘటనలో 54 మందిపై కేసు
జి.కొత్తపల్లిలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై జరిగిన దాడిలో ఆయనకు రక్షణగా ఉన్న కానిస్టేబుల్‌ నారాయణకు తీవ్రగాయమైంది. నారాయణ ఫిర్యాదు మేరకు 54 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: పోలీసుల ఎదుట లొంగిపోయిన.. ఏలూరు వైకాపా నేత హత్యకేసు నిందితుడు

ABOUT THE AUTHOR

...view details