ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరం జలవిద్యుత్ కేంద్రంలో కీలక పనులు ప్రారంభం - పోలవరం ప్రాజెక్ట్ విద్యుత్ ఉత్పత్తి వివరాలు

Draft tube Construction works: పోలవరంలో జలవిద్యుత్ కేంద్రంలో కీలకమైన డ్రాఫ్ట్ ట్యాబ్ పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రారంభించింది. విద్యుత్ కేంద్రం తొలి యూనిట్లో డ్రాఫ్ట్ ట్యూబ్ బిగించే పనులు చేపట్టారు. ఏపీ జెన్కో సిబ్బందితో పాటుగా మేఘా సంస్థ సంయుక్తంగా బిగింపు ప్రక్రియను చేపట్టింది.

డ్రాఫ్ట్ ట్యూబ్ నిర్మాణ పనులు
draft tube Construction works

By

Published : Dec 30, 2022, 10:42 PM IST

Polavaram hydro power center: పోలవరం ప్రాజెక్టులో ఉన్న జలవిద్యుత్ కేంద్రంలో కీలకమైన పనులు నేడు మొదలు పెట్టారు. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించిన నీటిని బయటకు పంపేందుకు వినియోగించే డ్రాఫ్ట్ ట్యూబ్ నిర్మాణ పనుల్ని కాంట్రాక్టు సంస్థ మేఘా ఇంజనీరింగ్ మొదలు పెట్టింది. ఇవాళ డ్రాఫ్ట్ ట్యూబ్​ను ఆ సంస్థ, ఏపీ జెన్కో సిబ్బంది సంయుక్తంగా బిగింపు ప్రక్రియను చేపట్టారు. విద్యుత్ కేంద్రం తొలి యూనిట్లో డ్రాఫ్ట్ ట్యూబ్ బిగించే పనులు చేపట్టారు. ప్రాజెక్టులో అంతర్బాగంగా నిర్మించే విద్యుత్ కేంద్రంలో మొత్తం 12 యూనిట్లను నిర్మించాల్సి ఉంది. మొత్తం 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఎగువ నుంచి నీటిని విద్యుత్ కేంద్రంలోని టర్బైన్​లపై పడి విద్యుత్ ఉత్పత్తి కానుంది. విద్యుత్ ఉత్పత్తికి వినియోగించిన నీటిని బయటకు పంపేందుకు గానూ ఈ డ్రాఫ్ట్ ట్యూబ్ ఉపకరిస్తుందని ఆధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details