Floods: చుట్టూ ఎత్తైన కొండలు.. గుట్టలు.. తివాచీ పరిచినట్లు గడ్డి మధ్యలో పిల్లకాలువలా ఓ వాగు. పైన కనిపిస్తున్న మనోహరమైన ప్రదేశం ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని యడవల్లి- బోళ్లపల్లి గ్రామాల మధ్య ఉంది. నెల కిందటి వరకూ కనువిందు చేసిన అందాలపై ఇప్పుడు ఒండ్రు పేరుకుపోయింది. పోలవరం ముంపు ప్రాంతం కావడంతో ఇటీవల వచ్చిన గోదావరి వరద అక్కడున్న ఎద్దు వాగుకు పోటెత్తింది. పచ్చికబయళ్లు 20 రోజుల పాటు గోదావరి నీరు, బురదలో మునిగాయి. వరద తగ్గాక అడుగు మేర మట్టి మేట వేసి.. కింది విధంగా కనిపించాయి.
బురదలో కొట్టుకుపోయిన.. ప్రకృతి అందాలు..!
Floods: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని యడవల్లి- బోళ్లపల్లి గ్రామాల మధ్య నెల కిందటి వరకూ కనువిందు చేసిన ప్రకృతి అందాలపై ఇప్పుడు బురద పేరుకుపోయింది. ఇటీవల వచ్చిన గోదావరి వరద అక్కడున్న ఎద్దు వాగుకు పోటెత్తింది. పచ్చికబయళ్లు 20 రోజుల పాటు గోదావరి నీరు, బురదలో మునిగాయి. వరద తగ్గాక అడుగు మేర మట్టి మేట వేసి..బురదమయం అయ్యాయి.
నాడు మనోహర దృశ్యం నేడు బురదమయం