Vatti Vasanth Kumar : అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన మాజీమంత్రి వట్టి వసంత్‌కుమార్ అంత్యక్రియలు.. ఆయన స్వగ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇటీవలే కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకున్నారు. కొద్దిరోజుల కిందట విశాఖ అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటూ.. ఆదివారం తుదిశ్వాస విడిచారు.
ముగిసిన మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ అంత్యక్రియలు - మాజీ మంత్రి మృతి
Vatti Vasanth Kumar : మాజీ మంత్రి వసంత్‌కుమార్ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్సపొందుతూ కన్నుముశారు. ఆయన స్వగ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
వట్టి వసంత కుమార్ స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లాలోని ఎం.ఎల్.పురం. ఉంగుటూరు నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికైన ఆయన… వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో పని చేశారు. గ్రామీణ అభివృద్ధి, పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు. అనారోగ్య కారణాలతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి విశాఖలోని నివాసంలో ఉంటున్నారు. వట్టి వసంత్‌కుమార్ మృతిపై.. ప్రముఖలు సంతాపం తెలిపారు. గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్, పవన్ కల్యాణ్, నారా లోకేశ్, రఘువీరారెడ్డి, నాదెండ్ల మనోహర్ సంతాపం తెలిపారు. పార్టీలకు అతీతంగా స్థానిక నేతలు.. ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
ఇవీ చదవండి :