Dr Chaparala Babji : ఏలూరుకు చెందిన డాక్టర్ చాపరాల బాబ్జీని అమెరికా సంయుక్త రాష్ట్రాల 'జీవిత సాఫల్య పురస్కారం' వరించింది. ఈ పురస్కారాన్ని బాబ్జీకి.. డల్లాస్ మేయర్ జాన్ ఎరిక్సన్, కొందరు సెనెటర్లు కలిసి అక్టోబర్ 15న అమెరికా అధ్యక్షుడి తరఫున ప్రదానం చేశారు. అమెరికా అభివృద్ధి పథంలో వివిధ రంగాల్లో అంకితభావంతో పని చేస్తూ.. దీర్ఘకాలంగా స్వచ్చంద సేవలు అందించే వారికి అమెరికా అధ్యక్షుడు ఈ అవార్డులు ఇస్తారు.
డాక్టర్ చాపరాల బాబ్జీకి.. అమెరికా "జీవిత సాఫల్య పురస్కారం"
Dr Chaparala Babji : వివిధ రంగాల్లో అంకితభావంతో పనిచేస్తూ.. దీర్ఘకాలంగా స్వచ్ఛంద సేవలు అందించే వారికి అమెరికా ప్రభుత్వం జీవిత సాఫల్య పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఇంతటి విశేషమైన పురస్కారాన్ని ఏలూరు జిల్లాకు చెందిన డాక్టర్ చాపరాల బాబ్జీ అందుకున్నారు.
ఐవీ లీగ్ విద్యాసంస్థల్లో ప్రవేశ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ ఇవ్వటంలో సేవలందిస్తున్నందుకు డాక్టర్ చాపరాలకు ఈ అవార్డు లభించింది. ఏలూరులోని కొండా పార్వతి దేవి థియోసాఫికల్ హైస్కూల్లో విద్యాభ్యాసం పూర్తిచేసిన బాబ్జీ.. సి.ఆర్.రెడ్డి కాలేజీలో మిగిలిన చదువు పూర్తి చేసి అమెరికాలో రెండు డాక్టరేట్లు పొందారు. ఇంకో భారత సంతతికి చెందిన వ్యక్తికి కూడా ఈ అవార్డు లభించింది. పారిశ్రామికవేత్త, వితరణ శీలి, వయోధిక అమెరికన్ సైనికులకు ఉపాధి నైపుణ్యాలను అందించడంలో కీలక పాత్ర పోషించిన అరుణ్ అగర్వాల్ (డల్లాస్) సైతం దీనిని అందుకున్నారు.
ఇవీ చదవండి: