ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భాషా బండి బాగుంది

Two wheeler modified ఎండలో మాడుతూ వర్షంలో తడుస్తూ బైక్​పై వెళ్లాలంటే ఎంతో చిరగ్గా ఉంటుంది కదా. కానీ ఏదైనా అర్జంట్​ అవసరం ఉంటే ఎండలో చెమటలు కక్కుతూ వర్షంలో తడుస్తూ వెళ్లక తప్పదు. ఇన్ని బాధలు పడ్డ ఓ వ్యక్తి పరిష్కారం కోసం ప్రయత్నించాడు. ఆలోచించగా అతనికి ఓ ఐడియా తట్టింది. అంతే తనకున్న వాహనానికి కొన్ని మెరుగులు దిద్ది ఎండైనా, వానైనా రయ్​మంటూ దూసుకుపోతున్నాడు. ఇంతకు అతను ఏం చేశాడంటే.

1
1

By

Published : Aug 12, 2022, 7:35 PM IST

Updated : Aug 13, 2022, 12:44 PM IST

Two wheeler modified: చూశారా ఈ వాహనాన్ని.. ఆటోలా ఉంది.. కానీ కాదు.. టూ వీలరే. ఎండలో, వానలో ఎక్కడికైనా వెళ్లాలంటే ఇబ్బందిపడుతున్న ఓ వ్యాపారి తన ద్విచక్రవాహనాన్ని ఇలా మార్చేశాడు.

ఏలూరుకు చెందిన కిరాణా వ్యాపారి షేక్​ భాషా ప్రతిరోజు తన షాపులో సరకుల కోసం మార్కెట్​కు వెళ్తుంటాడు.. కానీ అనుకోకుండా వర్షం వస్తే.. తనతో పాటు సరకులు కూడా తడిచిపోతుండేవి.. దీంతో ఎన్నో ఇబ్బందులు పడుతుండేవాడు. రెయిన్​ కోటు వేసుకుంటే.. తాను మాత్రమే వర్షం నుంచి తడవకుండా ఉండగలడు. సరకులు తడవ కూడదంటే... దానికి కూడా ఏదైనా టార్పాలిన్​ లాంటింది కప్పాలి... ఇదంతా ద్విచక్ర వాహనం మీద కష్టంగా ఉండేది.. అందుకే ఏదైనా చేయాలని ఆలోచించాడు... వర్షంలో తడవకుండా ప్రయాణించేలా తన ద్విచక్రవాహనాన్ని మార్చాలనుకున్నాడు.. అంతే మెరుగులు దిద్దడం ప్రారంభించాడు.

ద్విచక్రవాహనానికి చుట్టూ ఆటో మాదిరిగా చుట్టూ ఇనుప చట్రాన్ని ఏర్పాటు చేశాడు. దానికి వెనక, ముందు అద్దాలను ఫిట్​ చేశాడు. ఎండకు ఎండకుండా... వర్షానికి తడవకుండా పై భాగంతో పాటు వాహనానికి ఇరువైపులా ప్లాస్టిక్​ కవర్ కుట్టించాడు. వాటికి జిప్పులు కూడా అమర్చాడు. దీంతో అతను మండుటెండలోనూ వర్షం కురిసినా ఆగకుండా సౌకర్యవంతంగా ప్రయాణం కొనసాగిస్తున్నాడు. తన ద్విచక్ర వాహనాన్ని ఇలా మార్చినందుకు రూ.6 వేలు ఖర్చయిందంటున్నాడు భాషా. ఏలూరులోని రోడ్లపై పరుగులు తీస్తున్న ఈ వాహనం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఇవీ చదవండి:

Last Updated : Aug 13, 2022, 12:44 PM IST

ABOUT THE AUTHOR

...view details