ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వారిపై చర్యలు తీసుకోండి' - YSR Edible Oil Tank Larry Owners Association

కాకినాడలో పోర్టు, పరిశ్రమలపై ఆధారపడి జీవించేవారి విషయంలో ఇబ్బందులు లేకుండా, శాంతిభద్రలకు విఘాతం కలగకుండా ప్రభుత్వం చొరవ చూపాలని వైఎస్​ఆర్​ ఎడిబుల్‌ ఆయిల్‌ ట్యాంక్ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు కోరారు. కొత్తగా ఏర్పాటైన వైఎస్​ఆర్​ ఎడిబుల్‌ ఆయిల్‌ ట్యాంక్‌ లారీ ఓవర్స్‌ అసోసియేషన్‌లో 171 మంది సభ్యత్వం తీసుకున్నట్లు వివరించారు.

YSR Edible Oil Tank Larry Owners Association
వైఎస్​ఆర్​ ఎడిబుల్‌ ఆయిల్‌ ట్యాంక్ లారీ ఓనర్స్‌ అసోసియేషన్

By

Published : Jun 14, 2020, 4:54 PM IST

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కొత్తగా ఏర్పాటైన తమ యూనియన్‌ కార్యకలాపాలను అడ్డుకుంటున్న వారిపై రెవెన్యూ, పోలీసు యంత్రాంగం దృష్టి సారించాలని వైఎస్​ఆర్​ ఎడిబుల్‌ ఆయిల్‌ ట్యాంక్ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు కోరారు. ట్యాంక్‌ లారీ అసోసియేషన్‌ తమకు అనుకూలంగా ఉన్నవారికే సీరియల్‌ వేయడం, ఓడీలు ఇవ్వడం వల్ల మిగిలినవారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీంతో పాత యూనియన్‌ నుంచి విడిపోయి... కొత్తగా యూనియన్‌ ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా యూనియన్‌ ఏర్పాటుచేసుకున్న తర్వాత కూడా తమ లారీలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయమై పోలీసులు, స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details