ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉప్పుటేరు కాల్వలోకి దూకి యువతి ఆత్మహత్య.. కేసు నమోదు - east godavari district news updates

తూర్పుగోదావరి జిల్లా కొత్త మూలాపేటలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ఓ యువతి శీలంవారిపాలెం సమీపంలోని ఉప్పుటేరు కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

Young Lady suicide to Jump into canal in kotthamoolapeta East Godavari district
కాల్వలో దూకి యువతి ఆత్మహత్య

By

Published : Jun 21, 2020, 6:40 AM IST

తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొత్త మూలాపేట గ్రామానికి చెందిన సుగుణ అనే యువతి కాకినాడలోని ఓ కాల్ సెంటర్లో విధులు నిర్వహిస్తోంది. రోజూవారి విధుల్లో భాగంగా ఉదయం వెళ్లిన సుగుణ.. సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్లకుండా వంతెన పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

కొద్ది సేపటి తర్వాత మృతదేహం తేలుతుండటంతో గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details