తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద విద్యుదాఘాతంతో మృతి చెందిన కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఎమ్మెల్యే పర్వతప్రసాద్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో వేల సంఖ్యలో ఒకే చోట చేరటంపై పలువురు విమర్శలకు గుప్పిస్తున్నారు. యేలేశ్వరం శంఖవరం మండలాల్లో కొవిడ్ లక్షణాలతో ఇప్పటికే పలువురు బాధపడతున్నారు. ఆ మండలాల వైకాపా శ్రేణులు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొనటాన్ని స్థానికులు తప్పుబడుతున్నారు.
కరోనాను కేర్ చేయకుండా వైకాపా నాయకుల ధర్నా
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట వైకాపా నాయకులు ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే పర్వతప్రసాద్ ఆధ్వర్యంలో వేల సంఖ్యలో వైకాపా నాయకులు ఒకే దగ్గర చేరటంపై పులువురు విమర్శిస్తున్నారు.
ycp followers met at a single place in east godavaari dst pratipadu