తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో శుక్రవారం కరోనాతో ఓ మహిళ(45) మృతి చెందింది. ఆ మహిళ వారం క్రితం దుబాయ్ నుంచి స్వగ్రామానికి చేరుకుంది. నాలుగు రోజుల నుంచి ఆమెకు జ్వరం తీవ్రంగా ఉంది. ఉదయం స్థానిక లక్కవరం పీహెచ్సీలో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించారు.
రిపోర్టులో పాజిటివ్‌గా తేలింది. చికిత్స నిమిత్తం అమలాపురం కిమ్స్‌కి తరలించగా.. అక్కడ పరిస్థితి విషమించడంతో సాయంత్రం కాకినాడ తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందినట్లు లక్కవరం పీహెచ్సీ వైద్యాధికారి దుర్గా ప్రసాద్ తెలిపారు.