జగన్ ముఖ్యమంత్రి పీఠమెక్కితే ఎలాంటి అరాచకాలు చూడాల్సి వస్తుందోనన్న ఆందళన తమను కలిచివేస్తుందని తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యనించారు. అధికారంలో లేకుండానే అరాచకాలు సృష్టించే వైకాపా... అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజల పరిస్థితేంటో అర్థం కావడం లేదన్నారు. స్వతహాగా నేర స్వభావం ఉండే వైకాపా నాయకులు, కార్యకర్తలు ఇష్టారీతిన దౌర్జన్యాలకు పాల్పడుతారని వ్యాఖ్యనించారు. పిఠాపురం ఎమ్మెల్యే వర్మ వాహనంపై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేయాలని కోరుతూ సహచర ఎమ్మల్యేలు పెందుర్తి వెంకటేశ్ , దాట్ల బుచ్చిరాజుతో కలిసి జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందజేశారు.ఈ విషయమై ఎస్పీ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
'జగన్ ముఖ్యమంత్రి పీఠమెక్కితే ప్రజల పరిస్థితేంటి?' - jagan
అధికారంలో లేకుండానే అరాచకాలు సృష్టించే వైకాపా... అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజల పరిస్థితేంటో అర్థం కావడం లేదని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యనించారు.
జ్యోతుల నెహ్రూ