ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దొమ్మ వ్యాధి నివారణకు వ్యాక్సిన్ సిద్ధం: పశుసంవర్థకశాఖ జేడీ

పశువులకు వ్యాపించే దొమ్మవ్యాధి నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో ఏడున్నర లక్షల టీకాలు సిద్ధం చేసినట్లు పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

దొమ్మ వ్యాధి నివారణకు వ్యాక్సిన్ సిద్ధం: పశుసంవర్థకశాఖ జేడీ
దొమ్మ వ్యాధి నివారణకు వ్యాక్సిన్ సిద్ధం: పశుసంవర్థకశాఖ జేడీ

By

Published : Jun 14, 2020, 11:37 AM IST

వర్షకాలంలో పశువులకు వ్యాపించే దొమ్మవ్యాధి నివారణకు చర్యలు చేపట్టినట్లు తూర్పుగోదావరి జిల్లా పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అందుకోసం ఏడున్నర లక్షల టీకాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. జిల్లాలోని 157 పశువైద్యశాలలు,31 ప్రాంతీయ పశు ఆసుపత్రులు, కాకినాడలోని వెటర్నరీ పాలీ క్లినిక్​, 57 గ్రామీణ పశువైద్యశాలల్లో వాక్సిన్ అందుబాటులో ఉందన్నారు. పశువులకు వ్యాధి సోకితే రైతు భరోసా కేంద్రం ద్వారా పశుసంవర్థక శాఖ సహాయకులకు సమాచారాన్ని అందిచాలని రైతులకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details