తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని నివేదిత కిశోర్ విహార్ ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయురాలు మేకా సుసత్య రేఖ ట్విటర్‌లో పెట్టిన వీడియోపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ శనివారం స్పందించారు. ఈ వీడియో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో స్ఫూర్తి నింపిందని తిరిగి ఆయన ట్వీట్ చేశారు.పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ఏటా ప్రధాని మోదీ విద్యార్థులతో మాట్లాడతారు. దీనికి ఇప్పటి వరకు 5 లక్షల మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 1500 మందికే ఈ అవకాశం లభిస్తుంది.
‘పరీక్షా పే చర్చ’ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులు ఎలా సిద్ధపడాలనే దానిపై సుసత్యరేఖ వీడియో రూపొందించారు. విద్యార్థులను ఎంపిక చేసే విధానంలోని ఐదు అంశాలకు ఎలా సమాధానం ఇవ్వాలనే దానిపై అవగాహన కల్పించారు. సుసత్యరేఖ ఇప్పటికే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు అందుకున్నారు.