లాక్‌డౌన్‌లో కల్లు తీసుకోవడానికి అనుమతి ఇచ్చినందుకు తూర్పుగోదావరి జిల్లాలో కల్లుగీత కార్మికులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాజమహేంద్రవరం గ్రామీణ మండలం కలువగొయ్యిలో కల్లుగీత కార్మికులు కల్లు, పాలతో అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సుభాష్‌చంద్రబోస్, ఎంపీ మార్గాని భరత్‌రాం పాల్గొన్నారు. కరోనా కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆంక్షలు పెట్టామని మంత్రి వివరించారు. కల్లుగీత కార్మికుల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీఇచ్చారు. ఈ సందర్భంగా వారికి నిత్యావసరాలు అందజేశారు.
సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం - తూర్పుగోదావరి జిల్లా వార్తలు
కరోనా కష్టకాలంలో కల్లు తీసుకోవడానికి అనుమతినిచ్చినందుకు... తూర్పుగోదావరి జిల్లాలోని కల్లుగీత కార్మికులు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం