తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలం పాలగూడేనికి చెందిన కొమరం శ్రీను కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆసుపత్రిలో చికిత్స అందించినా ప్రయోజనం కనబడలేదు. నాటువైద్యం కోసం శ్రీను తండ్రి.. బంధువు సాయంతో ద్విచక్రవాహనంపై పక్క గ్రామానికి తీసుకెళ్లారు. చికిత్స తీసుకుని బుధవారం ఇంటికి తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యంలో శ్రీను ఇబ్బంది పడుతుండటంతో ఓ చెట్టు కింద వాహనాన్ని నిలిపి నీరు తాగిస్తుండగా.. ప్రాణాలు వదిలాడు. బాధను దిగమింగుకొని కుమారుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు.
విషాదం.. కళ్లెదుటే కడుపుకోత
కన్నకొడుకు కళ్లెదుటే ప్రాణాలు విడిస్తే ఆ తండ్రి ఆవేదన మాటల్లో చెప్పలేం. అంతటి విషాదంలోనూ బాధను దిగమింగుకొని కుమారుడి మృతదేహాన్ని బంధువు సాయంతో ద్విచక్రవాహనంపై...ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 30 కి.మీ ప్రయాణించి స్వగ్రామానికి తీసుకెళ్లారు.
కన్నకొడుకు మృతదేహాన్ని పాలగూడేనికి తరలిస్తోన్న తండ్రి