ఈ నెల 7న ప్రారంభించనున్న దిశ పోలీస్ స్టేషన్, ప్రత్యేక యాప్ కార్యక్రమాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధికారులతో సచివాలయంలో సమీక్షించారు. రాజమహేంద్రవరంలో దిశ కేసులకు సంబంధించిన పోలీస్ స్టేషన్, ఒన్ స్టాప్ సెంటర్లను సీఎం జగన్ ప్రారంభించనున్నారని ఆమె తెలిపారు. అనంతరం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో పోలీస్, వైద్యం, ఆరోగ్యం, ఫోరెన్సిక్ సిబ్బంది, డాక్టర్లు, విద్యార్థులకు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో సక్రమంగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ నిర్దేశించారు.
రాజమహేంద్రిలో దిశ పోలీసుస్టేషన్ ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష - ap cs latest news
రాజమండ్రిలో ఈనెల 7న దిశ పోలీస్ స్టేషన్, ఒన్ స్టాప్ సెంటర్లను సీఎం జగన్ ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తెలిపారు. ఈ కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో సచివాలయంలో ఆమె సమీక్ష నిర్వహించారు.
సీఎస్ సమీక్ష