తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం పలివెల ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు దుకాణంలోని రూ.3 లక్షల నగదును అపహరించారు. ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దుకాణం వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డును బెదిరించి తాళాలు పగలగొట్టారు. దుకాణంలో ఉన్న రూ.3 లక్షలు దోచుకెళ్లారు. ఆదివారం అమ్మిన మద్యం డబ్బులు.. బ్యాంకులో వేయడానికి వీలు లేనందున.. దుకాణంలోనే ఉంచినట్లు సిబ్బంది చెబుతున్నారు. కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు.
మద్యం దుకాణంలో చోరీ..రూ.3 లక్షలు దోచుకెళ్లిన దుండగులు.. - east godavari crime news
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం పలివెల ప్రభుత్వ మద్యం దుకాణంలో దొంగతనం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దుండగులు తాళాలు పగలగొట్టి రూ. 3 లక్షల నగదును అపహరించారు.
మద్యం దుకాణంలో చోరి