తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం ఈతలపాడు గ్రామం వద్ద వ్యవసాయ పనుల నిమిత్తం పొలంలో జేసీబీ పనులు చేస్తుండగా... పుట్టలో నుంచి 12 అడుగుల కొండచిలువ బయటకు వచ్చింది. దానిని జేసీబీ సహాయంతో హతమార్చారు. పామును చంపిన తరువాత పరీక్షించగా దాని కడుపులో పిల్లలతో పాటు, సమీప పుట్టలో మరి కొన్ని పాములు బయటకు వచ్చాయి.
ఈతలపాడులో కొండచిలువ హతం
రంపచోడవరం మండలం ఈతలపాడు గ్రామంలో మట్టి తవ్వతుండగా పుట్టలోనుంచి కొండచిలువ, దాని పిల్లలు బయటపడ్డాయి. స్థానికులు కొండచిలువను హతం చేశారు.
గిరిజనుల చేతిలో కొండచిలువ హతం