బ్యాంకుల వద్ద కనిపించని భౌతిక దూరం - physical distance issue in East Godavari
తూర్పుగోదావరి జిల్లా తునిలో బ్యాంకుల వద్ద ప్రజలు నిబంధనలు పాటించడం లేదు. భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా నిలబడుతున్నారు.

భౌతిక దూరం మరిచారు!
తూర్పుగోదావరి జిల్లా తునిలో బ్యాంకుల వద్ద ప్రజలు భౌతిక దూరం పాటించకుండా నిలబడుతున్నారు. కరోనా భయాందోళనకు గురి చేస్తున్నా...అనేకమందిలో ఇప్పటికీ అవగాహన రావడం లేదు. పోలీసులు, బ్యాంక్ అధికారులు హెచ్చరిస్తున్నా చాలామంది నిబంధనలు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు.