తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు తెదేపా బాధ్యుడు వరుపుల రాజా స్వగృహంలో పార్టీ శ్రేణులు దీక్ష చేపట్టాయి. లాక్ డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అదనపు విద్యుత్ చార్జీలతో ప్రభుత్వ భారం మోపిందని రాజా అన్నారు.
లాక్ డౌన్ కాలంలోని 3 నెలల విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నూతన శ్లాబు విధానం కాకుండా పాత విధానాన్ని అమలు చేయాలన్నారు.