ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా కుంట బ్లాక్ పరిధిలో ఏర్రబోరు జాతీయ రహదారిపై మావోయిస్టులు పది వాహనాలను దగ్ధం చేశారు. నేటి నుంచి దేశవ్యాప్తంగా చేపట్టనున్న బంద్‌ను విజయవంతం చేయాలని డిమాండ్ చేస్తూ వాహనాలకు నిప్పు పెట్టారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ తరువాత ఆ రాష్ట్రం మావోయిస్టులతో చర్చలు జరపాలని భావించింది. కానీ కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పటంతో దీనిని నిరసిస్తూ ఈ బంద్‌ను చేపట్టారు.
ఛత్తీస్‌గఢ్‌లో వాహనాలను దగ్ధం చేసిన మావోయిస్టులు
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు.. పది వాహనాలను దగ్ధం చేశారు. నేడు, రేపు దేశవ్యాప్తంగా చేపట్టనున్న బంద్‌ను జయంప్రదం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ చర్యకు పాల్పడ్డారు.
పది వాహనాలు దగ్ధం