తూర్పు గోదావరి జిల్లా అనపర్తికి చెందిన దళిత యువకుడు లోవరాజు కుటుంబ సభ్యుల్ని తెదేపా నేతలు పరామర్శించారు. తెదేపా రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు జవహర్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి తదితరులు అనపర్తి బాబానగర్ లోని లోవరాజు ఇంటికి వెళ్లి సానుభూతి తెలిపారు. వైకాపా నాయకులు నాటు సారా విక్రయాలను ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. నాటు సారా తాగి మరణించిన లోవరాజు కుటుంబానికి స్థానిక ఎమ్మెల్యే ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం అందించాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు.
'నాటుసారా విక్రయాలను వైకాపా ఆదాయ వనరులుగా మార్చుకుంది'
నాటు సారా తాగి ప్రాణాలు కోల్పోయిన దళిత యువకుడి కుటుంబ సభ్యుల్ని తెదేపా నేతలు పరామర్శించారు. ఇది ముమ్మాటికీ సర్కారు హత్యేనని తెదేపా రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు జవహర్ ఆరోపించారు.
దళిత యువకుడు కుటుంబ సభ్యులను పరామర్శించిన తెదేపా నేతలు