ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''మూసిన అన్న క్యాంటీన్లు వెంటనే తెరవాలి'' - east godavari district

మూసిన అన్న క్యాంటీన్లను వెంటనే తెరిపించాలని తెదేపా శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కాకినాడ రూరల్ మండల పరిధిలో జరిగిన ఈ ఆందోళనకు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యాయి.

tdp leaders protests front of ramanayyapeta market at east godavari district

By

Published : Aug 17, 2019, 9:01 PM IST

మూసిన అన్న క్యాంటీన్లు వెంటనే తెరవాలి..

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేటలో ఉన్న అన్న క్యాంటీన్ దగ్గర.. తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ,మేయర్ సుంకర పావని.. భారీ సంఖ్యలో హాజరైన తెదేపా శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ తెరవాలి.. అంటూ నినాదాలు చేశారు. ఎవరి పేరు క్యాంటీన్ మీద ఉన్నా అభ్యంతరం లేదనీ.. పేదవాడి కడుపు కొట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అనంతరం పేదలకు క్యాంటీన్ వద్ద ఉచితంగా భోజనం పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details