నివర్ తుపానుతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలుగుదేశం నేత వరపుల రాజా డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం జె. అన్నవరం, రమణయ్యపేటలో పంట పొలాలను పరిశీలించిన ఆయనకు.. రైతులు తమ బాధలను విన్నవించుకున్నారు. ప్రభుత్వాధికారులు ఇంతవరకు తమ వద్దకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరి పైరుకు మొలకలు రావడంతో..రైతులు ఆందోళన చెందుతున్నారు.
నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: వరపుల రాజా
తుపానుతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెదేపా నేత వరపుల రాజా డిమాండ్ చేశారు. ఏలేశ్వరం మండలంలో వరపుల రాజా పర్యటించి.. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.
tdp leader raja