తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కార్పొరేటర్లు, కీలక విభాగాల అధికారులు పాల్గొన్నారు. కాకినాడ నగరం అభివృద్ది చెందుతోందని ఎంపీ చెప్పారు.
'స్వచ్చ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకు కోసం కృషి చేస్తున్నాం'
కాకినాడ స్మార్ట్ సిటీకి.. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకు దక్కేలా కృషి చేస్తున్నట్లు ఎంపీ వంగా గీత అన్నారు. నగరంలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఎంపీ వంగా గీత
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పరిశుభ్రతతోపాటు వీధి వ్యాపారులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. పారిశుద్ధ్యం బాగున్న వార్డుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇస్తామన్నారు.
ఇదీ చదవండి: