తూర్పుగోదావరి జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకూ మరింత పెరుగుతోంది. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత ప్రజలు ఇంటి నుంచి బయటకు రావటానికి భయపడుతున్నారు. రాజమహేంద్రవరం, రాజానగరం ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్న సమయంలో రహదారులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. అత్యవసరమైన పని ఉంటేనే ముఖానికి రక్షణ ధరించి ప్రయాణం చేస్తున్నారు.
ఎండలతో రాజమహేంద్రవరం వాసుల బెంబేలు - rajamahendravaram
ఎండల తీవ్రతకు రాజమహేంద్రవరం వాసులు బెంబేలెత్తుతున్నారు. ఉదయం 10 దాటిన తర్వాత ఇంటి నుంచి బయటకు రావాలంటే జనం భయపడుతున్నారు.
ఎండల తీవ్రత