ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీ ఉమా మూలేశ్వర స్వామి వారి దర్శనం రద్దు - alumuru contaminent zone

తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలంలో శ్రీ ఉమా మూలేశ్వర స్వామి వారి ఆలయంలో దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ఆర్ కృష్ణ ప్రకటించారు. కరోనా కట్టడి చర్యలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

east godavari district
శ్రీ ఉమా మూలేశ్వర స్వామి వారి దర్శనం రద్దు

By

Published : Jul 20, 2020, 7:12 PM IST

తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా నాలుగు కేసులు నమోదు కావటంతో ఆయా ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్ లుగా అధికారులు ప్రకటించారు.

ఈ కారణంగా.. మండలంలోని శ్రీ ఉమా మూలేశ్వర స్వామి ఆలయంలో దర్శనాలను రద్దు చేస్తున్నట్లు కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ఆర్ కృష్ణ వెల్లడించారు. నిత్యం ఆది దంపతులకు ఏకాంత సేవ, కైంకర్యాలు యథావిధిగా జరుగుతాయన్నారు.

ABOUT THE AUTHOR

...view details