తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్వామివారి జన్మనక్షత్రం పర్వదినం సందర్భంగా.. స్వామి, అమ్మవార్లు, పరమేశ్వరుల మూలవిరాట్‌కు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ప్రాకారసేవ ఘనంగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వెండి తిరుచ్చిపై ఆసీనులను చేసి ప్రాకారం చుట్టు మూడుసార్లు ఊరేగించారు. అనంతరం నిర్వహించిన ఆయుష్య హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పౌర్ణమి సందర్భంగా క్షేత్ర రక్షకులు వనదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యంగిర హోమం జరిగింది. ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వ్రత మండపాలు, క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి.
అన్నవరం ఆలయంలో ఘనంగా స్వామివారి జన్మనక్షత్ర పర్వదినం
అన్నవరం ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అన్నవరం ఆలయం