తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం రమణయ్యపేట సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 6 టన్నుల ఇసుకను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని అన్ని ఇసుక రేవులతో పాటు నాటుసారా తయారీ కేంద్రాలపైన దృష్టి సారించినట్లు ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారి మణికంఠరెడ్డి తెలిపారు. ఏలేరు కాల్వలో తవ్వకాలు జరిపి రాత్రి వేళల్లో ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు.
'జిల్లాలో ఇసుక తరలిస్తున్న కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాం' - yeleswaram latest news
జిల్లాలో అక్రమ ఇసుక రవాణా, నాటుసారా నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారి మణికంఠరెడ్డి తెలిపారు. రమణయ్యపేట సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 6 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
ఇసుక రవాణా నియంత్రణకు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి