భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు - carona precautions
నేటి నుంచి దర్శనాలకు అనుమతి ఇవ్వటంతో భక్తులకు ఇబ్బందులు లేకుండా కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేవాదాయ శాఖ ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాలు సమర్పించేందుకు భక్తులు వస్తుంటారు. నేటి నుంచి బయటి ప్రాంత భక్తులకు అనుమతి ఇవ్వడంతో ఉదయం నుంచి స్వామివారికి తలనీలాలు సమర్పించేందుకు భక్తులు వచ్చారు. ప్రతి భక్తుడి వివరాలు నమోదు చేసుకుని థర్మో స్కానింగ్ చేసి శానిటైజర్ తో చేతులు శుభ్రం చేయించి అనంతరం లోపలికి అనుమతిస్తున్నారు. తలనీలాలు తీసేవారు శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులు ధరించి విధులకు హాజరయ్యారు.
ఇది చదవండి'చికిత్స అందకుంటే మరణమే.. కనీసం పింఛను ఇప్పించండి'