తూర్పు గోదావరి జిల్లా సింగపల్లి వద్ద కాలువ ఉద్ధృతంగా ప్రవహించింది. ఉదయం 3 గంటలకు ద్విచక్రవాహనంపై ఓ యువకుడు కాలువ దాటుతుండగా ఒక్కసారిగా ప్రవాహ ఉద్ధృతి పెరిగింది. ఆ ప్రవాహంలో అదుపుతప్పిన యువకుడు కొట్టుకుపోయాడు.
స్థానికులు రంగంపేట పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలికి చేసుకున్నారు. ఎస్.ఐ. సుధాకర్‌బాబు ప్రాణాలకు తెగించి.. కాల్వలోకి దిగి యువకుడిని ఒడ్డుకు చేర్చారు.