విశాఖపట్నంలో అభం శుభం తెలియని విద్యార్దినులపై ఇద్దరు ఉపాధ్యాయుల లైంగిక దాడి మరువక ముందే, తూర్పుగోదావరి జిల్లాలో మరో ఘటన వెలుగు చూసింది. ఏలేశ్వరం మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇద్దరు విద్యార్ధినులను ఉపాధ్యాయులు డి.తమ్మయ్య, టి.సాల్మన్‌రాజులు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారనే ఫిర్యాదు వచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన జాయింట్ కలెక్టర్ రాజకుమారి ఈ ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జేసి ఆదేశాల మేరకు ఈ ఇద్దరిని డీఈఓ సస్పెండ్ చేసినట్లు ప్రధానోపాధ్యాయులు కెవివి సత్యనారాయణ తెలిపారు. ఈ ఘటనలో పరోక్షంగా మరో ఇద్దరు ఉపాధ్యాయులపై ఆరోపణలు రాగ, వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసి డిప్యుటేషన్ పై వేరే పాఠశాలకు పంపినట్లు ప్రధానోపాధ్యాయుడు వెల్లడించారు. నిందితులపై పోస్కో చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు.
వారు టీచకులా..టీచర్లా - డి.తమ్మయ్య, టి.సాల్మన్‌రాజు
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఘటనలు విస్మయానికి గురి చేస్తున్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి ఆరోపణలు రావడంతో ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు.
sexually abusing students by two teachers in governement high school at eleswaram in east godavari district