తూర్పుగోదావరి జిల్లా తునిలో లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు ఆర్టీసీ డ్రైవర్ బాబ్జి తన వంతు సహాయం అందించి ఆదర్శంగా నిలిచాడు. పేదలకు బియ్యం, నిత్యావసర సరకులు, కూరగాయలు అందించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించారు.
నిత్యావసరాలు పంపిణీ చేసిన ఆర్టీసీ డ్రైవర్ - lockdown effect on people
రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఉపాధి నిలిచిపోవడంతో కూలీలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి అవస్థను గమనించి కొందరు వీరికి సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. తమ వంతు తోడ్పాటును అందిస్తూ ఉదారతను చాటుకుంటున్నారు.
నిత్యావసరాలు పంపిణీ చేసిన ఆర్టీసీ డ్రైవర్
ఇదీచదవండి.