తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ పిఠాపురం రోడ్డు మార్గంలో పండూరు గ్రామ కూడలి వద్ద క్వారీ లారీ, ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో గొల్లప్రోలు మండలం మల్లవరానికి చెందిన నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న తిమ్మాపురం ఎస్ఐ విజయబాబు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నారు.