తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం వద్ద 30వ నెంబరు జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 16 మంది వలస కూలీలు గాయపడ్డారు. గ్యాస్ సిలిండర్ల లోడుతో భద్రాచలం వైపు వెళ్తున్న మినీ లారీ, టాటా మ్యాజిక్ ఆటో వాహనం ఢీ కొన్నాయి. ఆటోలో ప్రయాణిస్తున్న ఒడిశాకు చెందిన వలస కూలీలు, డ్రైవర్ గాయపడ్డారు. వీరిని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గ్యాస్ లారీ వెనక చక్రాలు ఊడిపోయాయి. గ్యాస్ బండలు రోడ్డుపై పడ్డాయి.
మినీలారీ-ఆటో ఢీ... 16 మందికి గాయాలు - Road accident in east Godavari Etapaka Zone Purushottapatnam
సిలిండర్ లోడుతో వెళ్తున్న మినిలారీ, కూలీలతో వెళ్తున్న టాటా మ్యాజిక్ ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలోని 16 మంది వలస కూలీలు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం వద్ద జాతీయ రహదారిపై జరిగింది.
మినీ లారీ, టాటా మ్యాజిక్ ఆటో ఢీ ... 16 మందికి గాయాలు