ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముంపులో పల్లెలు.. అరచేతిలో ప్రాణాలు - godavari

తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నది ఉద్ధృతంగా పరవళ్లు తొక్కుతోంది. పలు ప్రాంతాల్లో నీటి మట్టాలు అధికస్థాయికి చేరుకుంటున్నాయి. లంక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు.

ప్రాణాలు గుప్పిట్లో పట్టుకుని

By

Published : Aug 1, 2019, 10:42 AM IST

లంక గ్రామాలు అప్రమత్తం..!
తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. బుధవారం రాత్రికి రాజమహేంద్రవరం వద్ద వరద తగ్గుముఖం పట్టినట్లు అధికారులు తెలిపారు. నీటిమట్టం ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 9.90 అడుగులకు చేరుకుంది. అక్కడి నుంచి సముద్రంలోకి నీటిని వదిలేస్తున్నామని జలవనరుల శాఖ వెల్లడించింది.

ఈ క్రమంలో కోనసీమ ప్రాంతంలోని వశిష్ఠ గోదావరి పాయలు పోటెత్తుతున్నాయి. పి. గన్నవరం నియోజకవర్గంలోని బూరుగులంక, పెదపూడిలంక, అరిగెలవారిపేటలు ముంపునకు గురయ్యాయి. గౌతమి- వృద్ధ గౌతమి నదిపాయలు దూకుడుగా ప్రవహిస్తున్నాయి. 16 లంక గ్రామాల ప్రజలు భయాందోళనలో గడుపుతున్నారు. వారంతా మర బోటుల్లో ప్రయాణాలు సాగిస్తూ... సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. కాలువ పైభాగాన ఉన్న పశ్చిమగోదావరి జిల్లా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ABOUT THE AUTHOR

...view details