రంపచోడవరం ఎండీవో కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, డీసీసీబీ చైర్మన్ అనంతబాబు కాకవాడ గ్రామ గిరిజనులకు పట్టాల పంపిణీ చేశారు. అనంతరం స్థానిక ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పథకం కింద విద్యార్థులకు బ్యాగులు, బూట్లు, పుస్తకాలు అందజేశారు. ఏళ్ల తరబడి సాగు చేస్తున్న కొండ పోడు భూములను.. అటవీ హక్కుల గుర్తింపు చట్టం ప్రకారం పట్టాలు అందజేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు.
గిరిజనులకు పట్టాలు పంపిణీ - rompa chodavaram latest news
కాకవాడ గ్రామ గిరిజనులకు ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పట్టాలు పంపిణీ చేశారు. కొండ పోడు భూములను అటవీ హక్కుల గుర్తింపు చట్టం ప్రకారం గిరిజనులకు పట్టాలు మంజూరు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆమె పేర్కొన్నారు.
గిరిజనులకు పట్టాలు అందజసిన ఎమ్మెల్యే
ఇదీ చదవండి:
గిరిజనులకు అటవీ భూములపై సాగు హక్కు పట్టాలు