ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తగ్గిన గోదావరి వరద.. లంక గ్రామాల పరిస్థితి ఏంటి? - godavari floods latest news

గోదావరి వరదలు పది రోజులపాటు లంక గ్రామాల ప్రజల జీవనాన్ని చిన్నాభిన్నం చేశాయి. వరద పూర్తిగా తగ్గుముఖం పట్టగా.. నదీ పాయల మధ్య ఉన్న లంకలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. కూలిపోయిన పూరిల్లు.. రెండు అడుగుల మేర బురదతో రోడ్లు... ఇసుక మేటలతో పొలాలు వరద ఉద్ధృతిని తెలియజేస్తున్నాయి. ఏడాదిలో 8 నెలల పాటు స్వచ్ఛమైన గాలి ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించే వీరంతా... జూలై నుంచి అక్టోబర్ నెల వరకు 4 నెలలపాటు దినదినగండంగా గడుపుతుంటారు. ఒక్కోసారి అందరూ నిద్రలో ఉండగానే మంచం కిందకు వరద నీరు చేరిన రోజులు ఉన్నాయని పూర్వీకులు గుర్తు చేసుకుంటున్నారు.

Reduced Godavari flood .. What is the condition of Lankan villages ..?
తగ్గిన గోదావరి వరద.. లంక గ్రామాల పరిస్థితి ఏంటి..?

By

Published : Aug 27, 2020, 4:58 PM IST

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం లంకా ఆఫ్ ఠాణేలంకలోని లోతట్టు ప్రాంతాల్లో ఇంకా వరద నీరు నిలిచే ఉంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురజాపులంకకు చెందిన వందలాది ఎకరాల్లో బెండ.. వంగ.. మునగ ఇతర కాయగూర తోటలు బురద మట్టిలో కూరుకుపోయాయి.

పంట నష్టంతోపాటు చేలల్లో ఇసుక మేటలు తీయడానికీ బోలెడంత ఖర్చు చేయవలసి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు పరిస్థితిని పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details