రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అయిందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ అన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రజలు వైకాపాను గెలిపించారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు సీఎం అంటే భయపడిపోతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో తెదేపాది గతం, వైకాపాది వర్తమానం, భవిష్యత్ భాజపాదేనని జోస్యం చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. 130 కోట్ల మందికి ఏకైక ప్రతినిధి నరేంద్రమోదీ అని ఉద్ఘాటించారు. రాంమాధవ్ సమక్షంలో తెదేపా మాజీ ఎమ్మెల్యే పి. నారాయణమూర్తి భాజాపాలోకి చేరారు.
''ప్రజల పరిస్థితి.. పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టైంది'' - ysrcp
ఏపీలో భవిష్యత్ భాజపాదేనని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ అన్నారు.
జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాదవ్