తూర్పు గోదావరి జిల్లాలో కొవిడ్ కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. రాజమహేంద్రవరంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రిని పూర్తి కొవిడ్ ఆసుపత్రిగా మార్చామన్నారు. 450 పడకలు ఉన్న ఈ ఆసుపత్రిలో బెడ్లన్నీ కరోనా రోగులకే కేటాయించారు. ఈ కారణంగా.. ఇతర వ్యాధిగ్రస్తులను ఆరోగ్య శ్రీ ఆస్పత్రులకు పంపుతున్నారు. కేసుల తీవ్రత దృష్ట్యా ఆక్సిజన్ సిలెండర్లు సైతం అందుబాటలో ఉంచినట్లు వైద్యాధికారులు వివరించారు.
ఇదీ చూడండి: