తూర్పు గోదావరి జిల్లా కడియంలో తెదేపా, వైకాపా నేతల మధ్య ఘర్షణ జరిగింది. ప్రభుత్వ పథకాల అమలుపై చర్చిస్తుండగా.. ఇరు వర్గాల మధ్య వివాదం నెలకొంది. ఒకరిపై మరొకరు పరస్పరం దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు... ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనలో తెదేపా వర్గీయులకు గాయాలవడంతో చికిత్స నిమిత్తం స్థానిక పీహెచ్సీకీ తరలించారు.
కడియంలో తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ - mprc, zptc elections in east godavari district
తూర్పుగోదావరి జిల్లా కడియంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ పథకాల అమలుపై చర్చిస్తున్న సమయంలో తెదేపా, వైకాపా నేతల మధ్య వివాదం జరిగింది. ఈ ఘటనలో గాయాలపాలైన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
కడియంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ