తెలుగుదేశం పార్టీ భాజపాపై దుష్ప్రచారం చేసిందని గుర్తించిన ప్రజలు... ఆ పార్టీకి ఎన్నికల్లో బుద్ధి చెప్పారని భాజపా జాతీయ నాయకురాలు పురంధేశ్వరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మండలం కొంతమూరులో జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె... అనంతరం విలేకరులతో మాట్లాడారు.ప్రత్యేక హోదా విషయంలో తెదేపా రాష్ట్ర ప్రజలను మోసగించిందని... అదేవిధంగా ఇప్పుడు జగన్ మోసగిస్తున్నారని ఆరోపించారు.కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని చెప్పిన తర్వాత కూడా... జగన్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం సరికాదన్నారు.
చంద్రబాబు బాటలోనే జగన్..: పురంధేశ్వరి - భాజపా
భాజపా ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉందని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఉద్ఘాటించారు. రాష్ట్రానికి ఏ అవసరం వచ్చినా కేంద్రం నుంచి సాయం అందిస్తామని తెలిపారు. చంద్రబాబు బాటలోనే జగన్ పయనిస్తున్నారని ఆరోపించారు.
దగ్గుబాటి పురంధేశ్వరి