తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో స్థానికులు కరోనా పరీక్షలను అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. మండలంలో క్వారంటైన్ పూర్తైన వారికి అలాగే ర్యాండమ్‌గా పరీక్షలు నిర్వహించేందుకు వైద్యాధికారులు గన్నవరానికి చేరుకున్నారు. ఉన్నత పాఠశాల వద్ద వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించగా... విషయం తెలుసుకున్న స్థానికులు ఆందోళనకు దిగారు. కొబ్బరి చెట్టును రోడ్డుకు అడ్డుగా వేసి... పరీక్షలు చేసేందుకు వచ్చిన సిబ్బందిని పాఠశాలలోకి రాకుండా అడ్డుకున్నారు. ఆస్పత్రిలో నిర్వహించాల్సిన పరీక్షలు.... పాఠశాలలో ఎలా నిర్వహిస్తారంటూ అధికారులను నిలదీశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని స్థానికులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. స్థానికులు మాత్రం పాఠశాలలో పరీక్షలు నిర్వహించేందుకు ససేమిరా అంటున్నారు. ఈ మేరకు అధికారులు వెనక్కి తగ్గారు. పి గన్నవరంలోని పాత భవనం వద్ద ఈ పరీక్షలు నిర్వహించారు.
'ఇళ్ల మధ్య కరోనా పరీక్షలెలా చేస్తారు'
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో కరోనా పరీక్షలను స్థానికులు అడ్డుకున్నారు. ఉన్నత పాఠశాల వద్ద కరోనా పరీక్షలు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. విషయం తెలుసుకుని స్థానికులు రహదారిని దిగ్బంధించారు. ఇళ్ల మధ్య పరీక్షలెలా చేస్తారని ఆందోళనకు దిగారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
public-attack