భవన కార్మికుల సంక్షేమ పథకాల బోర్డును కొనసాగించాలని అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మంత్రి కన్నబాబు ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ప్రదర్శనగా వెళ్తున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని, అరెస్ట్ చేశారు. ప్రభుత్వానికి, సీఎంకు వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు.
సంక్షేమ బోర్డు కొనసాగించాలని కోరితే కార్మికుల ఇళ్లకు పోలీసులను పంపి బెదిరింపులకు పాల్పడటం సరికాదని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నారు. గతంలో చంద్రబాబును విమర్శించిన జగన్ ఇప్పుడు ఈ విధంగా వ్యవహరించటం సమంజసం కాదన్నారు. ప్రజాప్రతినిధులుగా సమస్యను పరిష్కరించాల్సింది పోయి కొత్త సమస్యలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక పాలసీ, లాక్డౌన్ కారణంగా నష్టపోయిన కార్మికులకు పదివేలు ఆర్థికసాయం అందించాలని డిమాండ్ చేశారు.