తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో హుండీ లెక్కింపు సమయంలో సొమ్ము కాజేసి ఓ వ్రత పురోహితుడు భద్రతా సిబ్బందికి పట్టుబడ్డాడు. దేవస్థానంలో హుండీ సొమ్ము లెక్కింపు తర్వాత బయటకు వస్తున్న సమయంలో భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు.
హుండీ సొమ్ము కాజేసిన పురోహితుడు..శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులు
అన్నవరం దేవస్థానంలో హుండీ లెక్కింపు సమయంలో సొమ్ము కాజేసి ఓ వ్రత పురోహితుడు భద్రతా సిబ్బందికి పట్టుబడ్డాడు. అతన్ని విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఈవో త్రినాథరావు ఆదేశాలు జారీ చేశారు.
హుండీ సోమ్మును కాజేసిన పురోహితుడు..శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులు
ద్వితీయ శ్రేణి వ్రత పురోహితుడు ఓలేటి శ్రీనివాస శర్మ కండువాలో సొమ్ము ఉన్నట్లు గుర్తించి తనిఖీ చేయగా హుండీ డబ్బులు రూ.11,310 గుర్తించారు. లెక్కించే సమయంలో ఈ నగదు చోరీ చేసినట్లు నిర్ధరించారు. విచారణ చేపట్టిన అధికారులు శాశ్వతంగా అతన్ని విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలిచ్చారు.
ఇదీ చదవండి: