తూర్పుగోదావరి జిల్లా రాజానగరం దుర్గమ్మ గుడి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా 400 కిలోల గంజాయి పట్టుపడింది. విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి హైదరాబాద్ వెళుతున్న వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. ఒక కారు, మరొక వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు గుర్తించారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.20 లక్షలు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. వారిని కోర్టులో హాజరుపరుస్తామని స్పష్టం చేశారు.
రాజానగరం వద్ద వాహనాల తనిఖీలు.. 400 కిలోల గంజాయి పట్టివేత
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వద్ద వాహనాల తనిఖీల్లో హైదరాబాద్ వెళుతున్న రెండు వేర్వేరు వాహనాల నుంచి 400 కిలోల గంజాయి పట్టుబడింది. పోలీసులు నిందితులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
వాహనాల తనిఖీల్లో 400 కిలోల గంజాయి పట్టివేత