ఐదు నెలలుగా తమకు వేతనాలు చెల్లించకపోవడంపై కాకినాడ జూనియర్ వైద్యులు విధులు బహిష్కరించారు. బకాయిలు చెల్లించేవరకు వైద్యసేవలు నిలిపివేస్తున్నామని ,అత్యవసర సేవలు మాత్రం కొనసాగిస్తామని అక్కడి సూపరింటెండెంట్ రాఘవేంద్రపావుకు నోటీసు ఇచ్చారు. ఆందోళకు దిగారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకూ ఇవ్వాల్సిన వేతనాలు వెంటనే చెల్లించాలన్నారు. ఇకపై సమయానికే అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
''వేతనాల కోసం ఇంకెన్నాళ్లు?''
కాకినాడ ప్రభుత్వాసుపత్రి జూనియర్ వైద్యులు వేతనాల్లో జాప్యంపై ఆందోళన చేపట్టారు. బకాయిలు చెల్లించని కారణంగా.. వైద్య సేవలు నిలిపివేస్తున్నట్టు సూపరింటెండెంట్‌కు నోటీసు ఇచ్చారు. ధర్మా చేశారు.
salarey for juniour doctors